ఐపీఎల్ ఫైనల్ తేదీ పై హింట్ ఇచ్చిన గంభీర్… ఆ రోజున ఫైనల్ కచ్చితంగా గెలుస్తున్నాము…!

-

మరికొన్ని రోజులలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా 15 రోజుల షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.పార్లమెంట్ ఎన్నికలు ఉండటం వలన కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. పూర్తి షెడ్యూల్‌ రావాల్సి ఉంది. అయితే, తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఫైనల్ మ్యాచ్ తేదీపై హింట్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కేకేఆర్ ఆటగాళ్లతో గంభీర్ మాట్లాడుతూ…..ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ గెలవాల్సిందేనని ఆ జట్టు మెంటార్ గంభీర్ తమ ఆటగాళ్లకు స్పష్టం చేశారు. ఆటగాళ్లతో ఆయన మాట్లాడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో కేకేఆర్ పంచుకుంది. ‘మీరు ఒక గొప్ప జట్టుకు ఆడుతున్నారు. మైదానంలో ఆ విషయం గుర్తుపెట్టుకుని గర్వంగా, స్వేచ్ఛతో ఆడండి అని అన్నారు. ఈ జట్టులో సీనియర్లు, జూనియర్లు, అంతర్జాతీయ ఆటగాళ్లు, దేశవాళీ ఆటగాళ్లు అనే తేడా లేదు. మే 26న మనం కప్పు గెలుస్తున్నాం’ అని తెలిపారు.

కాగా, ఐపీఎల్ షెడ్యూల్ మొదటి ఫీజ్ను ఇది వరకే ప్రకటించారు. ఈ నెల 22న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి.మొదటి దశలో ఏప్రిల్ 7 వరకు మ్యాచులు జరగనున్నాయి. కొద్ది రోజుల్లో రెండో ఫేజ్ షెడ్యూల్ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news