ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. మార్చి 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి రెడీ అవుతోంది. మార్చి 22వ తేదీ నుంచి ఆహా వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

‘‘బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ చూసేయండి’ అంటూ ఆహా ఓ పోస్టర్‌ విడుదల చేసింది. రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌ కీలకపాత్రలు పోషించారు.

భాస్కర్ స్టోరీ ఏంటంటే : పోలీసు యంత్రాంగానికి స‌వాల్‌గా మారతాయి దిష్టి బొమ్మ హ‌త్య‌లు. దారుణంగా మ‌హిళ‌ల్ని హ‌త్య చేయ‌డం, త‌ల స్థానంలో దిష్టిబొమ్మ‌ని పెట్టి అడ‌వుల్లో మృత‌దేహాన్ని వ‌దిలి వెళ్లిపోవ‌డం. అలా 18 ఏళ్ల కాలంలో 17 హ‌త్య‌లు చోటు చేసుకుంటాయి. ఈ హ‌త్యలు ఓ సైకో కిల్ల‌ర్ చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తారు. కానీ, ఒక్క ఆధారమూ దొర‌క‌దు. ఈ కేస్‌ని పరిష్కరించడం కోసం రంగంలోకి దిగుతాడు డిటెక్టివ్‌ భాస్క‌ర్ నారాయ‌ణ (శివ కందుకూరి). అవి హ‌త్య‌లు కాదు, నర బ‌లులు అనే విషయాన్ని ప‌సిగ‌డ‌తాడు. ఇంత‌కీ అలా మ‌హిళ‌ల్ని బ‌లి ఇస్తున్న‌ది ఎవ‌రు? ఈ కేస్‌ని భాస్క‌ర్ నారాయ‌ణ ఎలా క్లోజ్ చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news