మళ్లీ జగన్‌కే ఎందుకు ఓటు వేయాలని సిద్ధం సభల్లో చెప్పాం.. తమకు ఓటు వేస్తే ఏం చేస్తారో చిలకలూరిపేట సభలో నేతలు చెప్పలేదు అని ఆయన వ్యాఖ్యానించారు.కాకినాడలో పాచిపోయిన లడ్డూలు, చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయి అని ప్రశ్నించారు. ఐదేళ్ల కింద చంద్రబాబు ఎందుకు తిట్టారు, ఇప్పుడు మోడీ ఎందుకు కావాల్సి వచ్చింది. చంద్రబాబులో ఈ మార్పుకు కారణం ఏంటి? అని అన్నారు.
చిలకలూరిపేటలో ఇవాళ జరిగిన తెలుగుదేశం పార్టీ-జనసేన-బీజేపీ ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘ఈ సభలో ప్రధాని మోదీకి అవమానం జరిగింది. మైక్ మూగబోవడంతో ఆయన బొమ్మలా నిలబడ్డారు అని అన్నారు. సభ జరుపుకోవడం చేతకానివారు జగన్పై యుద్ధం అంటున్నారు అని విమర్శించారు. లోపాయికారి ఒప్పందం చేసుకున్న మీకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ఎన్టీఆర్పై గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు’ అని ఆయన ప్రశ్నించారు.