BREAKING : గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు హతం

-

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా భద్రతా బలగాలు వీరిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. అయితే చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరిపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం.

చనిపోయిన మావోయిస్టులను వర్గీస్‌, మగ్తూ, కుర్సంగ్‌ రాజు, కుడిమెట్ట వెంకటేశ్గా అధికారులు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో మంచిర్యాల డివిజన్‌ కమిటీ సెక్రటరీ వర్గీస్‌, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, ప్లటూన్‌ మెంబర్లు రాజు, వెంకటేశ్‌ మృతి చెందినట్లు తెలిపారు. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news