‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’.. బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై

-

సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం రక్షించడంతో బల్గేరియా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపుతూ బల్గేరియా ప్రెసిడెంట్ రుమెన్‌ రాదెవ్‌ చేసిన ట్వీట్కు ప్రధాని మోదీ స్పందించారు. ‘‘భారత నేవీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్‌ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’ అని పోస్టు పెట్టారు.

దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ… ‘‘ఏడుగురు బల్గేరియా జాతీయులు సురక్షితంగా ఉన్నారు. త్వరలో తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు, హైజాకింగ్ వంటి చర్యల కట్టడికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ రిప్లై ఇచ్చారు. ఇప్పటికే ‘‘స్నేహితులు ఉన్నది అందుకే కదా’’.. మన విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా బల్గేరియాకు భరోసానిచ్చిన విషయం తెలిసిందే.

మాల్టా పతాకంపై వెళుతున్న నౌకను సముద్రపు దొంగలు గతేడాది డిసెంబరులో హైజాక్‌ చేయగా దానిని విడిపించేందుకు ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్లను భారత్ మోహరించింది. ఆపరేషన్‌లో భాగంగా మన తీరానికి దాదాపు 2600 కిలోమీటర్ల దూరంలో వాయుసేన తన ‘సీ-17’ రవాణా విమానం ద్వారా రెండు చిన్నపాటి యుద్ధ బోట్లను కచ్చితమైన ప్రదేశంలో జారవిడిచి, మార్కోస్‌ కమాండోలూ కిందికి దిగి.. దొంగల ఆటకట్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news