దిల్లీ లిక్కర్ స్కామ్.. రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటనపై ఆప్ స్పందన

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పందించింది. ఈడీ ప్రకటనను ఖండిస్తూ.. తీవ్ర లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఈ దర్యాప్తు సంస్థ బీజేపీ పొలిటికల్‌ వింగ్‌లా పని చేస్తోందని ధ్వజమెత్తింది.

2021-22 దిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరికొందరితో కలిసి అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా లాంటి ఆప్‌ అగ్రనేతలతో కలిసి కుట్ర పన్నారని ఈడీ తమ ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆ పార్టీ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారని పేర్కొంది.

దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో 500లకు పైగా సోదాలు జరిపినా.. వేల మంది సాక్ష్యులను విచారించినా దర్యాప్తు సంస్థకు అక్రమంగా ఉన్నట్లు నిరూపించేలా ఒక్క రూపాయి కూడా లభించలేదని పేర్కొంది. చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదని, అందుకే విసుగెత్తిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news