కన్న కొడుకు కోసం మరో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నవిషయం తెలిసిందే.ఈ మేరకు ఈరోజు తన కొడుకు, తల్లిని కలిసేందుకు గాను అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించింది.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనకు ఈడీ నోటీసులు సమన్లు జారీ చేసి అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈడీ కస్టడీ నుంచి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత అందులో కోరారు.అయితే, ప్రస్తుతం కవిత ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆ పిటిషన్ పనికరాదని కోర్టు చెప్పడంతో రిట్ పిటిషన్‌ను కవిత విత్‌డ్రా చేసుకుంది. ఇటీవల కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు కవితకి ఈనెల 23 వరకు కస్టడీ విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news