పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన లేకపోతే పొత్తులే లేవన్నారు. అందుకోసం బీజేపీ అధిష్ఠానాన్ని ఒప్పించినట్లు చెప్పారు. వంగా గీత,చలమల శెట్టి సునీల్ మన ద్వారానే వచ్చారు.. సునీల్ ఇటీవల ఎక్కడో పెళ్లిలో కూడా నాకు కనిపించారు.. సునీల్ మంచి వారే గానీ.. తప్పు పార్టీని ఎంచుకున్నారు అని అన్నారు. సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదని భావిస్తున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీకి సుస్థిరత ఇవ్వాలని మనసులో లేదు.. అందుకే రాష్ట్రం ఇలా తయారైంది అని విమర్శించారు.
నా క్యాడర్ ను నేను రక్షించుకుంటా.. నేను వదలను.. కాకినాడ పెన్షనర్ల ప్యారడైజ్ అని అందరూ అంటారు.. నేడు కాకినాడ గంజాయికి కేంద్రంగా, క్రైం పట్టణంగా మారింది.. వీటిని నిలువరించాలంటే బలమైన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.మరోవైపు వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిస్తే దేశం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని పవన్ అన్నారు.