చంద్రబాబు ఎప్పుడు ఒంటరిగా పోటీ చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈరోజు కర్నూలు లోని మీడియా తో మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తని తాము అస్సలు పట్టించుకోవట్లేదు అని అన్నారు. ఈ మూడు పార్టీలు ఎలా అయినా కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని హాట్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబుకి అభద్రతా భావం ఎక్కువ అని ఆయన మీద ఆయన నమ్మకం లేదని అందుకే ఢిల్లీ బాట పట్టారని ఆరోపించారు. మూడు రాజధానులు అంశానికి తాము ఇప్పటికే కట్టుబడి ఉన్నామని, వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ ని ఓడించలేరని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు ఒంటరిగా పోటీ చేయలేడు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.