కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో గ్రామ ఉజాల యోజన ఒకటి. ఇందులో దేశంలోని ప్రతి ఇంటికి ఎల్‌ఈడీ బల్బులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.10కే ఎల్ ఈడీ బల్బులను ప్రజలకు పంపిణీ చేస్తోంది. కానీ ఇలాంటి ఒక పథకం ఉందని కూడా చాలా మందికి తెలియదు. అందుకే మేము తెలియజేస్తున్నాం.
విశేషమేమిటంటే ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) గ్రామ్ ఉజాల పథకం కింద 50 లక్షల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసింది. ఇది ఇప్పటివరకు బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణ వంటి దేశంలోని పెద్ద ప్రాంతాలలో గ్రామాల్లో అమలు చేయబడింది.
CESL 2021 మార్చి నెలలో గ్రామాల్లో LED బల్బులను సరసమైన ధరకు అంటే రూ. 10కి పంపిణీ చేసే పనిని ప్రారంభించింది. ఈ పథకం కింద, CESL ఒక రోజులో 10 లక్షల LED బల్బులను ప్రజలకు పంపిణీ చేసింది. ఈ పథకం కింద, పాత బల్బులకు బదులుగా, ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన 7 వాట్స్ మరియు 12 వాట్ల LED బల్బులను 10 రూపాయల నామమాత్రపు రుసుముతో 3 సంవత్సరాల గ్యారెంటీతో అందిస్తోంది. ఈ పథకంలో ఒక కుటుంబానికి గరిష్టంగా 5 బల్బులు ఇవ్వవచ్చు.
గ్రామ ఉజాల పథకం కింద ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ వల్ల ఏటా దాదాపు 72 కోట్ల విద్యుత్ యూనిట్ల వినియోగం తగ్గుతోందట. దీనివల్ల ప్రభుత్వం మాఫీ చేసిన గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రూ.250 కోట్ల విద్యుత్ బిల్లులు తగ్గుముఖం పట్టాయి. ఈ పథకం మార్చి 2022 వరకు అమలు చేయబడింది. కానీ, పథకం వల్ల కలిగే ప్రయోజనాల కారణంగా ప్రభుత్వం గడువును పొడిగించవచ్చని భావిస్తున్నారు. CSS పోర్టల్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో అప్లైచేయొచ్చు లేదా దగ్గర్లోని CSS సెంటర్‌కు కూడా వెళ్లి ఫామ్ ఇవ్వొచ్చు.