99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకం – చంద్రబాబు

-

99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా నాడు ఇచ్చిన 99 హామీలను ప్రస్తావిస్తూ ప్రశ్నించిన చంద్రబాబు….మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న జగన్ రెడ్డి తన గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలి అంటూ విమర్శలు చేశారు.

5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకమన్నారు. విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద నాటకమని.. మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న జగన్.. ముందుగా తానిచ్చిన గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news