జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం…5 విద్యార్థులకు అస్వస్థత !

-

జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జనగామ జిల్లా పెంబర్తి లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినిలకు అస్వస్థత నెలకొంది. దీంతో హుటాహుటిన జనగామ మాత శిశు ఆసుపత్రికి తరలించారు అధికారులు.

Food poisoning in Janagama district

ఐదుగురు విద్యార్థినిలకు ఫుడ్‌‌ పాయిజన్ అయినట్లు వెల్లడించారు వైద్యులు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు… వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 3 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని తెలిపిన వైద్యులు….కాస్త వారిని జాగ్రత్త గా చూసుకోవాలని చెబుతున్నారు. కాగా… ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news