జైల్లో కార్యాలయం ఏర్పాటుకు అనుమతి తీసుకుంటాం: పంజాబ్ సీఎం

-

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ జైలు నుంచే పరిపాలిస్తారని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. జైల్లో కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని తెలిపారు. ‘జైలుకు వెళ్లినంత మాత్రాన నేరస్థుడు కాదని చట్టం చెబుతోంది అని అన్నారు. కాబట్టి సర్కారును నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని సుప్రీం, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, గురువారం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయినారు.నిన్న శుక్రవారం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కోర్టుకు హాజరుపరిచి.. ఈడీ 10 రోజుల కస్టడీకి కోరింది. దీంతో కోర్టు 6 రోజుల పాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి అరెస్ట్‌, ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. కాని కస్టడీపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news