తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు ఇసుక ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వెతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనులశాఖ ముఖ్యకార్యదర్శి బెన్హర్ మహేశ్త్ ఎక్కా శనివారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు-2015ను అమలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రజలు తమ సొంతింటి నిర్మాణానికి, ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. అయితే ‘శ్యాండ్ ట్యాక్సీ(మన ఇసుక వాహనం)’ విధానం అమల్లో ఉన్న నల్గొండ తదితర జిల్లాల్లో ఈ వెసులుబాటు అమలుకావడం లేదు. ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ సర్కార్.