ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్ ఫన్నీ సంభాషణ

-

నటుడు రామ్‌చరణ్‌, మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా మధ్య తాజాగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సరదా సంభాషణ చోటుచేసుకుంది. ‘‘సుజీత్‌ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు’’ అని చరణ్‌ ప్రశ్నించగా..  ‘‘గందరగోళంలో పడి మర్చిపోయా’’ అని మహీంద్రా రిప్లై ఇచ్చారు. అసలేం జరిగిందంటే?

2040 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారడమే మహీంద్రా లక్ష్యమని పేర్కొంటూ ఆ సంస్థ తాజాగా ఓ వాణిజ్య ప్రకటన విడుదల చేసింది. కొన్నేళ్ల క్రితం జహీరాబాద్‌లో మహీంద్రా ప్యాక్టరీ నిర్మించి లక్షలాది చెట్లు కూడా నాటడం, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్‌ కూడా నిర్మించినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. దాని వల్ల అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ 400 అడుగులు పెరిగి.. నీటి ఎద్దడి కారణంగా బ్రహ్మచారిగా ఉన్న సుజీత్‌కు పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని వీడియోలో తెలిపారు.

ఈ వీడియో చూసిన రామ్‌చరణ్‌ ‘‘ఆనంద్‌ మహీంద్రా.. సుజీత్‌ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? జహీరాబాద్‌ దగ్గర్లోనే నేను ఉండేది. ఆ ప్రాంతంలో నా స్నేహితులను సరదాగా కలిసేవాడిని. ఏది ఏమైనా ఇది గ్రేట్‌ వర్క్‌’’ అని పోస్ట్‌ పెట్టారు. ఇక దీనికి ఆనంద్ మహీంద్రా రిప్లై ఏం ఇచ్చారో మీరే చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news