5 వేల రూపాయలు అప్పు తీసుకున్న ఆటో డ్రైవర్ మీద దాడి జరిగిన సంగతి తెలిసిందే. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉండే బాలయ్య అనే ఆటో డ్రైవర్ మ్యతరి రవి అనే వడ్డీ వ్యాపారి వద్ద 5 వేలు అప్పుగా తీసుకొని సగం డబ్బులు చెల్లించాడు. మిగతా సగం డబ్బులు చెల్లించలేదని ఇంటికి వెళ్లి తన కొడుకుతో వీడియో తీయిస్తూ విచక్షణారహితంగా దాడి చేశాడు.
అయితే..దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారిని అరెస్టు చేశారు పోలీసులు. వికారాబాద్ కు చెందిన మ్యాతరి రవి అనే వడ్డీ వ్యాపారి రాజీవ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవరు బాలయ్యకు రూ.5 వేలు అప్పు ఇచ్చాడు. అసలు వడ్డీతో కలిపి రూ.6.500 అయింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆటో డ్రైవర్ పై వడ్డీ వ్యాపారి మ్యాతరి రవి దాడికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు వడ్డివ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.