NDA కూటమికి 400 సీట్లు రావడం ఖాయం అన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. నల్లకుంటలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం….నేను అంబర్ పేట్ బిడ్డను. సికింద్రాబాద్ ఎంపీ కాకముందు మూడు సార్లు అంబర్ పేట ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. ఈరోజు అంబర్ పేట నియోజకవర్గంలో కొన్ని బస్తీలు తిరగి, బస్తీ పెద్దలందరిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నాను…ప్రజలు నన్ను వారి కుటుంబ సభ్యుడిలాగ ఆప్యాయతతో పలకరిస్తున్నారని వివరించారు.
మీకు అండగా మేముంటామని సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు….ప్రధాని మోదీ గారి నాయకత్వం, వారి పట్ల అభిమానంతో ఉన్నారన్నారు. మోదీ గారి నాయకత్వంలోనే మన దేశం, పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు….భారీ మెజారిటీతో మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీకి 2019లో 302 సీట్లు వస్తే ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దుతో పాటు అనేక సంస్కరణలు చేయడంతో దేశ ప్రజలు 370 సీట్లు కట్టబెట్టపోతున్నారని చెప్పారు కిషన్ రెడ్డి.