అన్నదాతల చెంతకు గులాబీ బాస్ కేసీఆర్ వెళ్లనున్నారు. ముషంపల్లికి రాబోతున్న కేసీఆర్…..ఎండిన పంటల పరిశీలన చేస్తారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన చేస్తారు కేసీఆర్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు.
ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు కెసిఆర్ రానున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజ కవర్గ పరిధిలో పర్యటించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
గడిచిన పది సంవత్సరాలలో ఎండిపోని పంట పొలాలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయో అరా తీసారు కేసీఆర్…అత్యధికంగా బోర్లు వేసి నష్ట పోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలు పెట్టే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్న బీఆర్ ఏస్…ఎండిన పంటల పరిశీలన చేయనుంది.