140 పైగా అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తాం…. చివరకు కడప ఎంపీ సీటు కూడా గెలుస్తామని ప్రకటించారు చంద్రబాబు. నేను అందరి వాడిని… ఏ ఒక్కరి కోసం పనిచేయడం లేదని వెల్లడించారు. రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ…సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఓ ఫ్లాప్ షో అంటూ విమర్శలు చేశారు. జగన్ ఓ పెద్ద సైకో అయితే… రాప్తాడులో పిల్ల సైకో ఉన్నాడు….ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యానుకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారని ఆగ్రహించారు.
9 సార్లు సీఎం జగన్ కరెంటు చార్జీలు పెంచారు….రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది….ఇసుక అక్రమ రవాణా వెనుక తోపు ఉన్నాడని ఆరోపణలు చేశారు. కియా పరిశ్రమ ఏపీకి రావటం మన రేంజ్…. జాకీ పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోవడం వాళ్ల రేంజ్ అంటూ విమర్శలు చేశారు. రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లు వైసిపికి ఇచ్చారు…. ఏం ఒరగపెట్టారని నిలదీశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లను గెలిపించాలని కోరారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అంటూ మండిపడ్డారు.