గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టులో విచారణ జరుగుతుంది ఇప్పటికే జ్యూడిషియల్ కమిటీ వేసినట్లు హైకోర్టుకి ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజాశాంతి పార్టీ కేఫ్ చీఫ్ కేఏ పాల్ తాజాగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు పార్టీ ఇన్ పర్సన్ కి పాల్ వాదనలు వినిపించారు కేఏ పాల్ వేసిన పిటిషన్ చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతి ఇచ్చింది.
మంగళవారం రోజు పూర్తిస్థాయి వాదనలు వింటామని న్యాయస్థానం చెప్పింది తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. దాదాపు లక్షల కోట్లు అవినీతి జరిగిందని తమ్ముడు రేవంత్ రెడ్డి గతంలో ప్రాజెక్టు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తానని సిబిఐ ఎంక్వయిరీ చేస్తామని అన్నారని గుర్తు చేశారు కానీ రేవంత్ రెడ్డి గతంలో కలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం లేదని ఆరోపించారు.