సీఎం వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై సంచల ఆరోపణ చేశారు.చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అని సీఎం జగన్ విమర్శించారు.. నంద్యాల సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ …పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నరకాసురుడు, రావణుడు, దుర్యోదనుడు కలిశారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు .చంద్రబాబు కూటమిని ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను గతంలో చూశామని, మళ్లీ నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేస్తే మరో ఐదేళ్లు ముందుకు వెళ్తామని అన్నారు. ఒక్కసారి ఈ ఐదేళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు.