చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒక్కటీ కూడా లేదని సీఎం జగన్ అన్నారు. తాజాగా నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్దం సభలో మాట్లాడారు జగన్. ‘బాబు చరిత్ర చూస్తే.. ఏముంది గర్వకారణం. బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నదని గర్వకారణం. బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది.. అందరూ ఆలోచన చేయాలి. వీరు రాష్ట్రానికి ఏం మంచి చేశారని మళ్లీ మన ముందుకు వస్తున్నారు..? బాబు పేరు చెబితే బషీర్ బాగ్ కాల్పులు, కరువు, కాటకాలు గుర్తుకొస్తాయి’ అని విమర్శించారు.
2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమమైనా గుర్తుకొస్తుందా..? అని ప్రశ్నించారు. మళ్లీ ముగ్గురు రంగురంగు మేనిపెస్టోతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారు. గడిచిన 58 నెలల్లో ప్రతీ ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించామని తెలిపారు సీఎం జగన్. గతంలో పిల్లల చదువు కోసం ఎవ్వరూ పట్టించుకోలేదు. నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామని.. విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం బోధన ప్రవేశపెట్టామని తెలిపారు.