తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.
ఇక ఈ మూవీ తర్వాత ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగరతో సూర్య43 చేయబోతున్నాడు.అయితే ఈ రెండు చిత్రాలు షూటింగ్‌లో ఉండగానే సూర్య మరో స్టార్ దర్శకుడితో మూవీ ప్లాన్ చేస్తున్నాడు.
తాజాగా హీరో సూర్య తన తదుపరి చిత్రంపై అప్డేట్ ఇచ్చారు. జిగర్ తండా డబుల్ ఎక్స్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 44వ మూవీ చేయనున్నట్లు ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ‘Love Laughter War (–)’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ నిర్మించనుంది.