సీనియర్ నేత కె. కేశవరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు విప్లవ్ స్పందించారు. ‘కేకే, విజయలక్ష్మి నిర్ణయంతో నాకు సంబంధం లేదు అని అన్నారు. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్లోనే ఉంటా. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంది’ అని ప్రకటించారు.
కాగా, ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సీనియర్ నేత కె. కేశవరావు భేటీ అయ్యారు .పార్టీ మార్పు అంశాన్ని కేసీఆర్కు కేకే తెలిపారు. దీంతో కేకే తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు అని తెలుస్తోంది. ‘పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు పార్టీ మారడం సరికాదు. పార్టీలో మీకు ఏం తక్కువ చేశాం? మీ ఆలోచన చాలా తప్పు అని మీరే ఆలోచించుకోండి’ అని సూచించారు. అయితే తాను కాంగ్రెస్లోనే చనిపోతానని కేకే చెప్పారు.