రేవంత్ రెడ్డి సర్కార్ అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు అప్పులు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్…మళ్లీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. రాబోయే మూడు నెలల్లో మరో రూ. 16000 కోట్లు అప్పు తేనుంది రేవంత్ రెడ్డి సర్కార్.
ఇప్పటికే రూ. 18 వేల కోట్ల అప్పు కలిపి మొత్తం జూన్ వరకు రూ. 34 వేల కోట్లు తేనుంది రేవంత్ ప్రభుత్వం. ఈ మేరకు అప్పుల కోసం వినతి పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ఈ అప్పులు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.