ఎస్.. నేను రిలేషన్షిప్ లో ఉన్నా.. ఫ్యామిలిస్టార్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్‌ దేవరకొండ తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌, ‘ది’ ట్యాగ్‌పై క్లారిటీ ఇచ్చారు.

Vijay Devarakonda will give a gift of Rs

నటుల పేరు ముందు స్టార్‌ ట్యాగ్స్‌ పెట్టే సంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చిందో తనకు తెలియదన్న విజయ్ తనకు కూడా అలాంటి ట్యాగ్లు పెట్టాలని నిర్మాతలు చూశారని వాళ్లకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడినని చెప్పారు. విజయ్‌ దేవరకొండ ఒక్కడే. కాబట్టి, తనకేమైన టైటిల్‌ పెట్టాలనుకుంటే కేవలం ‘ది’ (the) అని యాడ్‌ చేయాలని చెప్పానని విజయ్‌ అన్నారు. మరోవైపు ‘మీరు రిలేషన్‌లో ఉన్నారా?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘అవును ఉన్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా’’ అని నవ్వుతూ విజయ్ దేవరకొండ బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news