Lucknow Super Giants won by 21 runs: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా… నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుస్తుంది అన్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. నిన్నటి మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. లక్నో లో క్వింటన్ డికాక్ 54 పరుగులు చేశాడు.
పురాన్ 42 పరుగులు, క్రూనాల్ పాండ్యా 43 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలో అద్భుతంగా ఆడింది. కానీ చివరికి చతికిల పడింది. దీంతో నిర్మిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 178 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ టీమ్. దీంట్లో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ 70 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.