వంద రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు : కేసీఆర్ 

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జనగాం, యాదాద్రి, సూర్యపేట జిల్లాల్లో పర్యటించి ఎండిపోయిన రైతుల పంటలను పరిశీలించారు. తాజాగా సూర్యపేటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు కేసీఆర్. చాలా చోట్ల రైతులు కన్నీరుమున్నీరు అయి మమ్ముల్ని ఆదుకోవాలి. మేము పెట్టుబడి పెట్టి నష్టపోయాం.. మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేయాలని విలపించారు. నీళ్లు ఇస్తామని చెబితే పంటలు వేసుకున్నాం. ఈ ప్రభుత్వం మాటలు విని నష్టపోయాం. ఏడెనిమిది సంవత్సరాలు వ్యవసాయ స్థీరికరణ కేంద్రబిందువుగా పెట్టుకొని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన విధానాలు తీసుకొని చర్యలు చేపట్టింది. 

రైతులకు నీరు సరఫరా చేయడం, రైతుకు పెట్టుబడి ఇవ్వడం, రైతుబంధు దేశంలోనే తీసుకొచ్చి సమయానికి పెట్టుబడి సహాయం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతుల పంటలు 7,600 పై చిలుకు కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం, రైతు బీమా ఏర్పాటు చేయడం వ్యవసాయ రంగం అద్భుతమైన దశకు చేరుకుంది. 2014కి ముందు 30-40 లక్షల ధాన్యాన్ని పండించని తెలంగాణ.. మూడు కోట్లకు పైగా పండించిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తించింది. వంద రోజుల్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తారనుకోలేదు. రైతులు ఇంత గోస పడుతారనుకోలేదు. రాష్ట్రంలో దాదాపు 100 నుంచి 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జర్నలిస్టులు పరిశీలన చేసి రాయండి. రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకుంటారని అస్సలు అనుకోలేదని కేసీఆర్ వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news