నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది. ఉల్లి దండలు మెడలో వేసుకుని ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. అసెంబ్లీ ఫైర్ స్టేషన్ దగ్గర టీడీపీ ఆందోళన చేపట్టింది. అయితే అసెంబ్లీ ప్రధాన ద్వారం టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్లకార్డులతో అనుమతి లేదని టీడీపీ అధినేత చంద్రబాబును గేటు వద్దే పోలీసులు ఆపేశారు. చంద్రబాబుతో పాటు ఇతర నేతలను గేటు వద్దే ఆపేశారు.
దీంతో పోలీసులు- తెలుగు తమ్ముళ్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయన్నారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని బాబు చూపించారు.ధరలు దిగివచ్చేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు. ఉల్లి కేజీ రూ. 200 అమ్ముతుందంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.