తరతరాలుగా జనాలను ఏడిపిస్తోన్న ఉల్లి.. దాని పరంపరను కొనసాగిస్తోంది. అయితే ఆ ఉల్లి కాస్త రూట్ మార్చింది. కోసేటప్పుడే కాదు కొనేటప్పుడే ఏడిపించడం ప్రారంభించింది. ఖరీదు చూస్తేనే ఖంగు తినేలా చేస్తోంది. అయితే పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది. ఉల్లి దండలు మెడలో వేసుకుని ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. అసెంబ్లీ ఫైర్ స్టేషన్ దగ్గర టీడీపీ ఆందోళన చేపట్టింది. పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులపై మోయలేని భారంగా మారాయని చంద్రబాబు అన్నారు.
ఆరునెలల పాలనలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరేముందు చంద్రబాబు వెంటకపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉల్లి కేజీ రూ. 200 అమ్ముతుందంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇంకోవైపు రైతులకు గిట్టుబాటు ధర రావడంలోని చంద్రబాబు విమర్శించారు.