తన అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక బ్యాటర్ల వికెట్లు తీసిన లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి భారీగా అభిమానులున్నారు. వారంతా జట్టుకు ఎంతో లాయల్‌గా ఉంటారు. నేను వికెట్లు తీసిన తర్వాత బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వారు నన్ను సపోర్ట్ చేయడం ఎంతో నచ్చింది.అభిమానులందరూ నాకు మద్దతిచ్చారు’ అని తెలిపారు.
ఇదిలా ఉంటే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతోన్న మయాంక్ యాదవ్ ప్రదర్శన చూసి అతని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అతను త్వరలోనే భారత జట్టుకు ఆడతాడని, మెరుగ్గా రాణిస్తాడని తల్లి మమతా యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మయాంక్ డైట్ గురించి చెబుతూ.. ‘గతంలో మాంసం తినేవాడు. శ్రీకృష్ణుడిని ఆరాధించడం మొదలుపెట్టాక మానేశాడు అని తెలిపింది. నాన్‌వెజ్ తన బాడీకి సెట్ కావట్లేదన్నాడు. ఇప్పుడు వెజిటేరియన్‌గా మారాడు. రోటి, పప్పు, రైస్, కూరగాయలు తింటున్నాడు’ అని వెల్లడించింది.