ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో నిన్న గుజరాత్ టైటాన్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 199 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేధించింది. శశాంక సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ఆ లక్ష్యాన్ని అవలీలగా పంజాబ్ చేదించింది. అయితే.. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
మొన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో… శశాంక్ సింగ్ ను 20 లక్షలకు కొనుగోలు చేసింది పం జాబ్. వాస్తవానికి శశాంక్ ను పంజాబ్ కొనుగోలు చేయాలని అనుకోలేదు. వేరే శశాంక్ అనుకోని… ఇతన్ని కొనుగోలు చేసింది పంజాబ్. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. కానీ ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం ఉండదని బీసీసీఐ స్పష్టంగా చేసింది. దాంతో అప్పుడు శశాంకును అనవసరంగా కొనుగోలు చేశామని ప్రీతిజింటా భావించారట. కానీ నిన్నటి మ్యాచ్లో అదే శశాంక్ అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ప్రీతి జింటాను ఆడుకుంటున్నారు సోషల్ మీడియా వారియర్స్.