కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

తనపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. ‘నా పేరు వాడి అసత్యాలు మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల చిట్టా బయటపెడతాం అని అన్నారు. ఆయనకు నిజాం కంటే ఎక్కువ ఆస్తి ఉంది సంచల ఆరోపణలు చేశారు. దోచుకున్న ఆస్తులను ప్రజలకు పంచుతాం. నాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా. రేపు ప్రెస్మిట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని కోమటిరెడ్డి వెల్లడించారు.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ విరుచుకుపడ్డారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా మిగిల్చిన మిడ్ మానేరును తాము ఆఘమేఘాల మీద పూర్తి చేశామని కేసిఆర్ తెలిపారు. ‘ఆ సందర్భంలో భారీవర్షం కురిసి కట్ట కొట్టుకుపోయింది. అది కట్టింది ఇప్పుడు అడ్డం పొడువు మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కంపెనీయే అని ఆయన వ్యాఖ్యానించారు. మేం మీలాగా చిల్లరగాళ్లం కాదు కాబట్టి అప్పుడు కేసులు పెట్టలేదు.కాళేశ్వరం కూడా అంతే.. త్వరగా నీళ్లందించాలని నిర్మించాం’ అని కేసిఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news