విరాట్ కోహ్లి వంద శాతం ఎఫర్ట్ పెట్టినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవట్లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. బ్యాటింగ్ భారాన్ని విరాట్ కోహ్లీ తన భుజాలపై మోస్తున్నారని, ఏ ఒక్కరి నుంచి సపోర్ట్ రావట్లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ లో విరాట్ 105 సగటు, 146 స్ట్రైక్తేట్తో 316 రన్స్ చేయగా, మిగతా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లందరూ కలిపి 496 రన్స్ మాత్రమే చేశారు. దీంతో కోహ్లి ఆర్సీబీ నుంచి వెళ్లిపోవాలని, అతడికి మంచి టీమ్ అవసరమంటు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, నిన్న జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపు పొందింది. బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్ను 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. జాస్ బట్లర్ (100* పరుగులు), కెప్టెన్ సంజూ శాంసన్ (69 పరుగులు, 42 బంతుల్లో; 8×4, 2×6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.ఇక మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో విరాట్ సూపర్ సెంచరీ (113 పరుగులు, 72 బంతుల్లో ; 12×4, 4×6)తో బెంగళూరుకు మంచి స్కోర్ కట్టబెట్టాడు.