టీడీపీ పై వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారని మంత్రి జోస్యం చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబుపై తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్ తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తాను చంద్రబాబును ఎప్పుడూ తిట్టలేదని.. కేవలం రాజకీయంగా మాత్రమే విమర్శించానని స్పష్టం చేశారు. చంద్రబాబును తిట్టిన వాళ్లంతా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారన్నారు. నేను పండక్కి డ్యాన్స్ చేస్తే విమర్శిస్తున్నారు.. కానీ చంద్రబాబు, ఆయన పక్కన ఉండే పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్యాన్స్ ని సెటైర్ వేశారు. పవన్ డబ్బుల కోసం డ్యాన్స్ వేస్తే.. చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డ్యాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు కాసేపు పవన్ , కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తారని చమత్కరించారు. సత్తెనపల్లిలో చంద్రబాబు సభకు జనమే రాలేదని అన్నారు. చంద్రబాబు అసమర్దత వల్లే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.