వాస్తు బాగోలేదని సచివాలయానికి రాలేదు.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం..!

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎన్నడూ ప్రజలను, వాళ్ల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వాస్తు బాగోలేదని సచివాలయానికి రాకుండా.. పదేళు ఫామ్ హౌస్ నుండే పాలన చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పదేళ్లు సమర్ధవంతంగా పని చేశామని చెప్పారు. ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు బీజేపీనీ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు.

బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక దేశంగా అవతరించిందన్నారు. బీజేపీ మూడవ సారి అధికారంలోకి వస్తే అతిపెద్ద ఆర్థిక దేశంగా తీసుకొస్తామని హామీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాటలు ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. నరేంద్ర మోడీని ఇచ్చారు. మూడోసారి ప్రధానిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. ముస్లిం ఆడబిడ్డల మేలు కోసమే ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి కోసం మోడీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news