తెలంగాణ రైతులకు ఇబ్బందులు రానివ్వం – మంత్రి కోమటిరెడ్డి

-

ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వబోమని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇవ్వాల ఉదయం ఆర్ఆర్ఆర్ లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు.

gajwel farmers met komatireddy

పీర్లాపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డి పల్లి, ఆలీరాజ్ పేట్, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు, మక్తా మాసాన్ పల్లి, మరియు సామలపల్లి, నెంటూర్, బంగ్లవెంకటాపూర్, బెగంపేట్, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులకు ఇటీవల ఆర్ఆర్ఆర్ నిర్మాణ భూసేకరణకు నోటీసులు వచ్చాయని, అయితే తాము ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూనిర్వాసితులం అయ్యామని మళ్లీ తమకు మిగిలిన కొద్దిపాటి భూములు ఆర్ఆర్ఆర్ లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

మా పరిస్థితిని మానవతా ధృక్పథంతో పరిశీలించి ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని వారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విన్నవించారు. రైతులతో సుధీర్ఘంగా మాట్లాడిన మంత్రి వారి సాధకబాధకాలను తెలసుకొని.. తాను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news