బీజేపీతో కాదు.. కాంగ్రెస్ తోనే సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం : కిషన్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్‌కు సోమవారం సీఎం రేవంత్ వెళ్లి..  అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొడంగల్ నుంచి 60 ఏళ్ల క్రితం అచ్యుతా రెడ్డి మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి చేపట్టలేదు. కొడంగల్ నుంచి గెలిచిన తనకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. 100 రోజుల్లో కొడంగల్‌కు మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీ తీసుకొచ్చానని సీఎం రేవంత్ వివరించారు. అలాంటి తనపై కుట్ర జరుగుతోందని హాట్ కామెంట్స్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీతో ఎలాంటి అపాయం లేదని.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం ఎలాంటి డిస్టబెన్స్ చేయమని స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్తమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో భారీ మెజార్టీతో మోడీ ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. మూడోసారి మోడీ భారత ప్రధాని అయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా మార్పులు జరుగుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news