సమ్మర్ ఎఫెక్ట్.. క్యాబ్లో ఏసీ కావాలంటే ఎక్స్ ట్రా ఛార్జ్ చెల్లించాల్సిందే

-

తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ ఎండలో ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా ఎక్కడికైనా వెళ్లాలంటే క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. తీరా క్యాబ్‌ ఎక్కాక ఏసీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎండ వేడికి క్యాబ్లో ఏసీ లేకుండా ప్రయాణించడం నరకమే. అయితే టిప్‌ లేదా అదనపు ఛార్జీలు చెల్లిస్తే ఏసీ వేస్తామని క్యాబ్‌ డ్రైవర్లు చెబుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జంట నగరాల్లో ప్రధాన కంపెనీలైన ఓలా, ఉబర్‌, రాపిడో అగ్రిగేటర్‌ సంస్థల తరఫున క్యాబ్‌లు నడుపుతున్న డ్రైవర్లు రెండు రోజులుగా ఈ ‘నో ఏసీ క్యాంపైన్‌’ నడిపిస్తున్నారు. ఏసీతో క్యాబ్ నడపాలంటే అగ్రిగేటర్‌ సంస్థలు చెల్లించే కమీషన్‌ సరిపోవడం లేదని అంటున్నారు. కమీషన్లు పెంచాలని వారి దృష్టికి తీసుకువెళ్లామని తెలంగాణ గ్రిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్ల యూనియన్‌(టీజీపీడబ్ల్యూయూ) తెలిపింది. లేదంటే కర్ణాటక మాదిరి క్యాబ్‌లకు యూనిఫాం ధరలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news