జనగామ మార్కెట్ యార్డ్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి…వారి తాటతీస్తామంటూ !

-

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని… రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

CM Revanth’s key statement on grain purchases

జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటన పై సకాలంలో స్పందించి… రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని వెల్లడించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news