సీఎం రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు వివాదస్పద వ్యాఖ్యలు !

-

కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 80 లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు కానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టిక్కెట్లు ఎలా ఇస్తారు? అని నిలదీశారు. ఒక్క సీటుకు కూడా మా మాదిగలు అర్హులు కారా? మా మాదిగ కులానికి న్యాయం చేయండన్నారు.

Motkupalli narsimhulu

10 మంది సీఎంలను చూసాను కానీ ఈరకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరూ లేరు. మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి? ఒక కాంగ్రెస్ నాయకుడిగా బాధ పడుతున్నానని వెల్లడించారు. మా మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్లుగా 3 స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తుంది. ఇది మాదిగ జాతికి అవమానకరమని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం రోజు ట్రై చేస్తున్నాను కానీ ఇవ్వట్లేదని ఆగ్రహించారు మోత్కుపల్లి నర్సింహులు.

Read more RELATED
Recommended to you

Latest news