“వార్” లో అడుగు పెట్టిన ఎన్టీఆర్.. న్యూ లుక్ ఫొటోలు వైరల్

-

బాలీవుడ్ ‘వార్’లో అడుగుపెట్టేశారు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్ గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’ కి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయనే విషయం తెలిసిందే.. హృతిక్ రోషన్ కి సంబంధించిన చాలా సీన్లు మేకర్స్ చిత్రీకరించేశారు.

తాజాగా తారక్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో తారక్ పాల్గొననున్నారు. వార్2 కోసం ఎన్టీఆర్ 60రోజులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హృతిక్, తారక్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారని జాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిద్ద కలిసి మొత్తంగా 30 రోజుల పాటు కలిసి షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news