తాగు నీటి అవసరాలపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం..!

-

నాగార్జున సాగర్ జలాల కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొంటున్న నీటి ఎద్దడి కారణంగా సాగర్ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. అయితే ఈ జలాశయంలో 500 అడుగులకు పైన ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాలని కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.

ఈ 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలను కేటాయిస్తున్నట్టు కమిటీ తెలిపింది. అప్పట్లో ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించగా వాటి తమకు మరో 5 టీఎంసీలు మిగిలి ఉందని.. అది వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అదనంగా మరో 7 టీఎంసీలు వాడుకుందని ఏపీ వాదించింది.  కృష్ణా జలాల్లో ఏపీ ఎక్కువగానే వాడుకుందని.. అంతా లెక్కలోకి రాలేదని, శ్రీశైలం నుంచి నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ కోరింది. సాగర్ కుడి కాలువ కింద తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందని.. వీలైనంత ఎక్కువగా నీరు విడుదల చేయాలని ఏపీ కోరగా.. ఎడమ కాలువ కింద జిల్లాలు, హైదరాబాద్ జనాభాను దృష్టిలో ఉంచుకొని తమకు ఎక్కువ కేటాయించాలని తెలంగాణ కోరింది. దీంతో ఇరు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. 

Read more RELATED
Recommended to you

Latest news