నిన్న విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పై రాయితో దాడి చేశారు.ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కన్నుకి గాయం అయింది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. CMRF హరికృష్ణ గారు ఫస్ట్ ఎయిడ్ చేశారు .ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది.ఈ ఘటనపై ఇప్పటికే పలువురు నేతలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే .
తాజాగా తెలుగుదేశం పార్టీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ‘దాడి సమయంలో కరెంట్ తీసేశారు.ఓ ఫొటోలో గాయం మామూలుగా ఉంది. మరో దాంట్లో కన్ను చుట్టూ కమిలినట్లుగా ఉంది. ఇలాంటి వాటికి ఎవరైనా కుట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. నాకు హార్ట్ సర్జరీ జరిగినప్పుడు నలుగురు డాక్టర్లు ఉన్నారు మాత్రమే ఉన్నారు. కానీ జగన్ కి చిన్న గాయమైతే ఇంత మంది డాక్టర్లా? అని అన్నారు. ఇవి చూస్తుంటే ఈ దాడి బూటకమనే అనుమానాలు వస్తున్నాయి’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.