జగన్ పై దాడి గురించి వైసీపీ నేతలకు ముందే తెలుసు… వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

-

నిన్న విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పై రాయితో దాడి చేశారు.ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కన్నుకి గాయం అయింది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్పై రాయి పడటం చిన్న స్టేజ్ డ్రామా అని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. దాడి గురించి కొందరు వైసీపీ నేతలు, పోలీసులకు ముందే తెలుసని ఆరోపించారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే ధర్నాలు ఎలా చేశారు? వేగంగా ఫ్లకార్డులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. కరెంటు పోయిన వెంటనే సీఎంకు రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు కూర్చున్నారు? అని నిలదీశారు.

ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడుపై, ఆయన తనయుడు నారా లోకేష్‌పై ఆరోపణలు చేసారని, ఇక స్క్రిప్ట్‌లో భాగంగా సీఎం జగన్‌పై దాడి చేసిన వ్యక్తి అంటూ ఎవరో ఒకరిని తీసుకు వచ్చి చంద్రబాబు చెప్తేనే చేశాను అని చెప్పించే యోచనలో వైసీపీ ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news