Temper Movie Actress Apoorva Srinivasan Wedding : టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ఏడడుగులు వేసినట్లు ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఈ వేడుకకు హాజరయ్యారు.
కాగా ఈమె టెంపర్ సినిమాలో కీలకపాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమ కథ చిత్రం 2, తదితర చిత్రాల్లో నటించారు.