సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు శుభాకాంక్షలు – KTR

-

 

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అంటూ కేటీఆర్‌ పోస్ట్‌ పెట్టారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు చెప్పారు. వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోందని తెలిపారు.

KTR wishes who have shown their potential in All India Civil Services

వందలోపు నాలుగు ర్యాంకులు సాధించిన తెలంగాణ బిడ్డలు దోనూరు అనన్య రెడ్డి, నందాల సాయికిరణ్, కేఎన్ చందన జాహ్నవి, మెరుగు కౌశిక్ లకు, వారి తల్లితండ్రులకు శుభాభినందనలు చెప్పారు కేటీఆర్‌. సివిల్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక కావటమనేది ఎంతో ఆనందాన్నిచ్చే వార్త అన్నారు. ప్రతిష్టాత్మక సివిల్స్ లో కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మన విద్యార్థులు సత్తా చాటుతుండటం గర్వంగా ఉందని వివరించారు. సివిల్స్ సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నానని కోరారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news