మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్లు నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈటల రాజేందర్, సతీమణి జమున రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్కు ఈటల భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పురి ఉన్నారు.
అంతకుముందు ఈటల మాట్లాడుతూ.. మల్కాజ్ గిరి గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండా అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపును ఆపే దమ్ము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదని అన్నారు. దొంగ సర్వే రిపోర్టర్స్ తో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా భారీ మెజార్టీతో గెలుస్తామని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ లో కురుక్షేత్రంలా ధర్మానికి, అధర్మానికి యుద్ధం జరగబోతోందని, ఇందులో ధర్మంవైపు నిలబడిన బీజేపీయే గెలుస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఎక్కడా ఏ ఉద్యమం పురుడు పోసుకున్నా అందులో తన గొంతు వినిపించానని ఈటల పేర్కొన్నారు.