BREAKING: ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది. ఇవాళ సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసు విచారణను జులై 24 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. కేసులో తగిన సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది.
అటు సెలవుల తరువాత విచారణ జరపాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ లుత్రా. 2015 జరిగిన వ్యవహారం అని ఏళ్ళ తరబడి కేసు పెండింగ్ లో ఉంటుందని కోర్టుకు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది. ఇక ఈ ఓటుకు నోటు కేసును విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, ఎస్వీ ఎన్ భట్టి ల ధర్మాసనం…కీలక ప్రకటన చేసింది. ఓటుకు నోటు కేసు విచారణను జులై 24 కి వాయిదా వేసింది.