కారు పాడైంది షెడ్డుకే పరిమితం.. ఇక బయటకు రాదు : రేవంత్ రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఇక కారు షెడ్డు నుంచి బయటకు రాదని అన్నారు. కారు పూర్తిగా పంక్చర్ పాడైపోయిందని విమర్శించారు. 20 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని కేసీఆర్ అన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక్కడ కాపలా ఉంది రేవంత్ రెడ్డి అని.. ఎమ్మెల్యేలను ముట్టుకో మాడి మసైపోతావు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా.. పార్లమెంటులో నిద్రపోవడానికా బీఆర్ఎస్ కు ఓటు వేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు నుంచి వంశీని గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఆయన చాలా సేవ చేస్తారని తెలిపారు. ప్రజలంతా ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news